Tuesday, November 11, 2025
ePaper
Homeనల్లగొండCompensation | తడిసిన ధాన్యం తల్లడిల్లిన రైతులు..

Compensation | తడిసిన ధాన్యం తల్లడిల్లిన రైతులు..

  • ప్రభుత్వ వైఖరిపై మండిపడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
  • రైతులకు అండగా ఉంటామని హామీ..

ప్రకృతి ప్రకోపం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నల్గొండ జిల్లా రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అకాల వర్షాలకు తడిసి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్జాలభావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు.

రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన పర్యటనలో కనిపించిన హృదయవిదారక దృశ్యాలను ఆయన మీడియాకు వివరించారు. పుట్టెడు దుఃఖంలో అన్నదాతలున్నారని జిల్లాలో ఎక్కడ చూసినా పంటలు నష్టపోయి, రైతులు బాధల తో విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం చేతకానితనం ఓ వైపు, ప్రకృతి ప్రకోపం ఓ వైపు” కు అన్నదాతలు బలైయ్యారని మండిపడ్డారు.

మంత్రులు కమిషన్ల కోసం ఆరాటం….

జిల్లా మంత్రులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి, కేవలం కమిషన్లు, సంపదనపైనే దృష్టి సారించారని, విదేశీ టూర్లలో జల్సాలు చేస్తున్నారని, దోచుకోవడం మీదనే వారి దృష్టి అంతా ఉందని ఆరోపించారు.రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి వారికి మంత్రులు సాగిలపడ్డారని, ఫలితంగా మిల్లర్లు రైతులను పిక్కు తింటున్నారని తీవ్రంగా విమర్శించారు.

​కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతోందని, పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన అన్నారు.​గత ప్రభుత్వ విధానం లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిబంధనలు అన్ని పక్కన పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేశామని గుర్తుచేశారు.ప్రస్తుత ప్రభుత్వo యూరియా కొరతతో కొన్నాళ్లు రైతులను ఏడిపించిందని, ఇప్పుడు ధాన్యం కొనక ఏడిపిస్తోందని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.

తక్షణమే కొనుగోలు చేయండి.. లేదంటే తిరుగుబాటు.

​తుఫాన్ తో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రైతులు కూడా బయటికి వచ్చి మంత్రులను, ఎమ్మెల్యేలను వెంటపడి నిలదీయాలని, ఎక్కడికక్కడ ప్రశ్నించాలని మజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్పి రెడ్డి లుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News