Friday, November 14, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్Crisis | మొంథా తుఫాన్ ముంచెత్తిన రైతుల ఆశలు

Crisis | మొంథా తుఫాన్ ముంచెత్తిన రైతుల ఆశలు

మట్టినే నమ్ముకుని ప్రజానీకానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతలు.. ఆరుగాలం చేసిన కష్టం పంట రూపంలో నోటి కందే టైంకు “మొంథా తుఫాన్” నీటి పాలు చేసింది. తినడానికి తిండి లేని దుస్థితి, అప్పుల వాళ్ళకు మొఖం చూపించలేని దీనస్థితి.. ఈ పచ్చి నిజం పాలకులకు తెలుసు.. అయినా కంటి తుడుపు చర్యలే! ప్రపంచానికి ముఖం చూపించలేక తలుపులు వేసుకొని ఏడుస్తున్నరు రైతులు. మట్టిని నమ్ముకున్నోళ్ళ బతుకు మట్టిపాలాయే? ప్రకృతి ప్రకోపమో, పాలకులు నిర్లక్ష్యమో.. విసిగి వేసారి భరించలేని అన్నదాత ! కాడి మేడి వదిలేస్తే! అన్నమో రైతన్న అంటూ అలమటిస్తారు? అన్నదాతల బతుకులు బాగుపడితేనే జాతికి మెతుకులు.. పాలకులు మేల్కొనకుంటే జాతి భవిత ముమ్మాటికి మట్టి పాలే..

  • మేదాజీ

RELATED ARTICLES
- Advertisment -

Latest News