Saturday, May 16, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | మద్దతు ధర లేక రైతన్నల కన్నీటి గాథ

Aaj Ki Baath | మద్దతు ధర లేక రైతన్నల కన్నీటి గాథ

నేడు రాష్ట్రంలో రైతన్నలు శ్రమటోడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి పడిగాపులు కాయల్సి వస్తోంది. కోత కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది ప్రభుత్వం, తరుగు పేరిట రెండు నుంచి నాలుగు కేజీల ధాన్యాన్ని దోచేస్తున్నారు అధికారులు.. నిల్వ సౌకర్యాల కొరతతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ, అడుగడుగునా మోసపోతున్న రైతన్నలు, కనీస మద్దతు ధరలు లేక కంట తడి పెడుతున్నరు.. ప్రభుత్వం కొనుగోలు విషయంలో సాకులు చెబుతూ తప్పించుకోకూదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • చాపల అనిల్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News