Homeమహబూబ్‌నగర్‌Arrest | బోరు మోటార్లు, కేబుల్‌ వైర్ల దొంగ అరెస్ట్

Arrest | బోరు మోటార్లు, కేబుల్‌ వైర్ల దొంగ అరెస్ట్

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఊరుకొండ మండలం(Urkonda Mandal) పరిసర గ్రామాల్లో రైతుల వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్లు, కేబుల్‌ వైర్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజులుగా రాత్రి వేళల్లో ఈ చోరీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Arrest

ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన కృష్ణ దామిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతని వద్ద నుంచి ఒక బోరు మోటారు, సుమారు 500 మీటర్ల కేబుల్‌ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కల్వకుర్తి సీఐ భీమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు కల్వకుర్తి ఎస్సై కురుమూర్తి పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News