(జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి జన్మదినం సందర్భంగా, జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఆయనకున్న విడదీయరాని అనుబంధం, పార్టీ బలోపేతానికి రామ్ చేస్తున్న అపూర్వ త్యాగాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న ప్రత్యేక కథనం)Ram Talluri Jana Sena General Secretary
- “రథసారథి కృష్ణుడిని పాటించిన అర్జునుడిలా..
- ‘వారాహి’ జెండాపై కపిరాజులా ‘రామ్ తాళ్ళూరి’
- జనసేన జెండా + పవనుడి అజెండా = ప్రజలకు అండ దండ.. ఇదే అతని ఫార్ములా..!Ram Talluri Jana Sena General Secretary
- జనసేన ఏడు సిద్ధాంతాలే తన ఆరో ప్రాణంగా.. పవన్ మాటే లక్ష్మణరేఖగా..
- ప్రజల కష్టాల కన్నీటితో నిండి, తొణకని కుండలా మారిన తెలంగాణ
- మరలా ‘కోటి రతనాల వీణ’గా మోగాలంటే…
- రాష్ట్రంలో జనసేన శంఖారావం పూరించాలి : ‘రామ్ తాళ్ళూరి’
శ్రీరాముడిని రాజుగా చూడటం కోసం భరతుడు 14 ఏళ్లు ఎదురుచూశాడు. 2014లో మొదలైన జనసేనకి, 2028 తెలంగాణ ఎన్నికలనాటికి 14 ఏళ్లు…భరతుడి నిరీక్షణ ఫలించినట్టుగానే, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Ram Talluri Jana Sena General Secretary) “జనసేన”ని రాజుగా చూస్తామని ‘రామ్ తాళ్ళూరి’ అచంచల విశ్వాసం!
రాజకీయాల్లో పదవులు ఆశించి వచ్చే వారు కొందరైతే… తాము నమ్మిన నాయకుడి సిద్ధాంతాల కోసం, ప్రజాక్షేమం కోసం తమ సమయాన్ని, శ్రమను ధారపోసే వారు మరికొందరు. అలాంటి అరుదైన కోవకు చెందిన నాయకుడే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ పారిశ్రామికవేత్త, చలనచిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి. సెప్టెంబర్ 26న ఆయన పుట్టినరోజు సందర్భంగా, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో ఆయనకున్న విడదీయరాని బంధం, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న నిరంతర కృషిపై ప్రత్యేక విశ్లేషణ.
భరతుడి నిరీక్షణ – రామ్ తాళ్ళూరి సంకల్పం :
పవన్ మాటే లక్ష్మణరేఖగా… భరతుడి పధ్నాలుగేళ్ల నిరీక్షణలాగే సాగుతున్న ఈ ప్రయాణానికి 2028 తెలంగాణ ఎన్నికలనాటికి నిండుగా 14 ఏళ్లు! ఆనాడు భరతుడి నిరీక్షణ ఫలించినట్టుగానే, రాబోయే ఎన్నికల్లో పవనుడిని విజయ శిఖరాన రాజుగా చూస్తామని ‘రామ్ తాళ్ళూరి’ అచంచల విశ్వాసం.. రామాయణంలో శ్రీరాముడి ఆదేశాన్ని శిరసావహించి, ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి, రాముడి ఆశయమే శ్వాసగా భరతుడు అయోధ్యను పాలించాడు. అక్కడ ఎక్కడా భరతుడికి స్వార్థం లేదు.. కేవలం రాముడి పట్ల భక్తి, ఆయన ఆశయాల పట్ల అంకితభావం మాత్రమే ఉంది. నేడు జనసేనలో రామ్ తాళ్ళూరి పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. ఒకరు “పవర్ స్టార్” కి ప్రతిరూపమైతే… మరొకరు నాయకుని సిద్ధాంతాలను నిజం చేయడానికి నిలబడిన ఒక నమ్మకమైన ‘జనసైనికుడు’. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, లక్ష్యాలను గుండెల్లో నింపుకుని, ఆయన చూపిన బాటలో నడుస్తూ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రచండ విప్లవమే “వ్యూహకర్త రామ్ తాళ్ళూరి”.
2014 నుంచే అలుపెరుగని ప్రయాణం.. ఎటువంటి ఆపేక్ష లేని బంధం :
చాలామంది నాయకులు ఎన్నికల సమయంలోనో, లేక అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడో తెరపైకి వస్తుంటారు. కానీ రామ్ తాళ్ళూరి అందుకు భిన్నం. జనసేన పార్టీ ఆవిర్భవించిన 2014 నుంచే ఆయన పవన్ కళ్యాణ్ వెనుక ఒక బలమైన శరమై నిలిచారు. ఐటీ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా (లీడ్ ఐటి కార్పొరేషన్ అధినేతగా), ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, వాటన్నింటికంటే పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే మిన్నగా భావించారు. ఎటువంటి పదవులు ఆశించకుండా, సుదీర్ఘ కాలం పాటు తెరవెనుక ఉంటూ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.
అధినేత నమ్మకం… పార్టీకి వ్యవస్థాగత బలం :
రామ్ తాళ్ళూరి లోని అంకితభావాన్ని, అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలను గుర్తించిన పవన్ కళ్యాణ్, ఆయనకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తూ… “రామ్ తాళ్ళూరి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని కనబరుస్తూ వచ్చారు” అని కొనియాడడం వారి మధ్య ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి ప్రతీక.
పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని సమన్వయం చేయడంలోనే కాకుండా, ముఖ్యంగా తెలంగాణ విభాగంలో జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఒకవైపు వ్యాపారాలు, మరోవైపు సినిమా నిర్మాణాలు ఉన్నా… వాటన్నింటికంటే ఎక్కువగా, కేవలం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ, తన విలువైన సమయాన్ని పార్టీ శ్రేణుల కోసం వెచ్చిస్తున్నారు.
సేవలోనే పరమార్థం.. అధినేతను మెప్పించిన మానవతావాదం :
రామ్ తాళ్ళూరి వ్యక్తిత్వంలో మరో గొప్ప కోణం ఆయన సేవా గుణం. వ్యాపారంలో సంపాదించిన దానిని సమాజ సేవకు ఉపయోగించాలనే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తారు. ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ నమ్మకమైన ‘జనసైనికుడిగా’ గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంతటి ఆత్మీయుడో, రాజకీయ ప్రయాణంలోనూ అంతటి నమ్మకస్థుడైన సైన్యాధ్యక్షుడు ఈ ‘రామ్’.
ఆశయాల వారధికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
స్వార్థ రాజకీయాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో, నాయకుడి గెలుపే తన గెలుపుగా భావించి, అహర్నిశలూ శ్రమిస్తున్న రామ్ తాళ్ళూరి లాంటి నాయకులు జనసేనకు ఒక పెద్ద అసెట్. అన్ని కులాలను గౌరవిస్తూ, అన్ని వర్గాలను కలుపుకుంటూ, సమాజంలో సామరస్యాన్ని నింపుతూ… జనసేన సిద్ధాంతాల బాటలో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే మహా వృక్షానికి ఒక పటిష్టమైన వేరులా నిలిచి, పార్టీని బలోపేతం చేస్తున్న రామ్ తాళ్ళూరి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజా సేవలో నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ… జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!
