Homeఆదాబ్ ప్రత్యేకంDr. Maroju Brahmachari | పల్లెటూరి ఒడి నుంచి నైరోబీ సదస్సు దాకా..

Dr. Maroju Brahmachari | పల్లెటూరి ఒడి నుంచి నైరోబీ సదస్సు దాకా..

  • డాక్టర్ మారోజు బ్రహ్మ చారి స్ఫూర్తిదాయక ప్రస్థానం!Dr. Maroju Brahmachari

విద్యకు, కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్న ఒక చిన్న మారుమూల గ్రామం. అక్కడ జన్మించిన ఒక సాధారణ బాలుడు.. కలలు కనడమే కాకుండా, వాటిని నిజం చేసుకునేందుకు పడిన శ్రమ, పట్టిన పట్టుదల నేడు ప్రపంచ స్థాయిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయనే డాక్టర్ మారోజు బ్రహ్మచారి (Dr. Maroju Brahmachari) ..

చిన్నతనంలోనే అవకాశాల వేటలో భాగ్యనగరమైన హైదరాబాద్ బాట పట్టిన ఆయన, నగరానికి వచ్చి ఎదుర్కొన్న సవాళ్లు ఎన్నో. అయితే, ఎక్కడా అధైర్యపడకుండా కష్టపడి పనిచేసే గుణాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. అంతటితో తన ప్రస్థానాన్ని ఆపలేదు. నిరంతర విద్యార్థిగా తన ఆకాంక్షలను సజీవంగా ఉంచుకుంటూ, న్యాయశాస్త్రాన్ని అభ్యసించి హైకోర్టులో న్యాయవాదిగా అడుగుపెట్టారు. టాక్స్ ప్రాక్టీషనర్‌గా, లాయర్‌గా సమాజానికి బహుముఖ సేవలు అందిస్తూ “కృషితో నాస్తి దుర్భిక్షం” అనే నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

- Advertisement -
Dr. Maroju Brahmachari

గ్లోబల్ వేదికపై భారత్ తరఫున ప్రతినిధిగా..:Dr. Maroju Brahmachari
డాక్టర్ బ్రహ్మచారి ప్రతిభ, సమాజం పట్ల ఉన్న అంకితభావం ఆయనను అంతర్జాతీయ స్థాయికి చేర్చాయి. యునైటెడ్ పీస్ కీపర్స్ ఫెడరల్ కౌన్సిల్ లో కంట్రీ డైరెక్టర్‌గా విశేష సేవలు అందిస్తున్న ఆయన, ప్రపంచ వేదికపై భారత్ గళాన్ని వినిపించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో 21-9-26 లో జరిగిన “2026 ఇంటర్నేషనల్ పేట్రియాటిక్ ప్యాక్ట్ ఆర్గనైజేషన్ ఫోరమ్ (ఆటమ్)” సదస్సులో యూ.ఎన్.పీ.కే.ఎఫ్.సి. ఇండియా తరఫున ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కనీస సదుపాయాలు లేని గ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం, అంతర్జాతీయ సదస్సుల స్థాయికి చేరుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం.

Dr. Maroju Brahmachari at International Forum 1

నేటి యువతకు స్ఫూర్తిప్రదాత :Dr. Maroju Brahmachari
మనోధైర్యం, కఠిన శ్రమ, క్రమశిక్షణ ఉంటే గ్రామీణ నేపథ్యం లేదా పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని డాక్టర్ మారోజు బ్రహ్మచారి నిరూపించారు. ఒకవైపు ఉపాధి పొందుతూనే, మరోవైపు ఉన్నత విద్యను అభ్యసించి, సమాజానికి సేవ చేస్తూ ప్రపంచ వేదికలపై గుర్తింపు సాధించడం నేటి యువతకు, విద్యార్థులకు మార్గదర్శకం. పల్లె తల్లి ముద్దుబిడ్డగా ప్రస్థానం ప్రారంభించి, గ్లోబల్ వేదికపై దేశ పేరును మార్మోగిస్తున్న డాక్టర్ మారోజు బ్రహ్మచారికి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది..! ( epaper.aadabhyderabad.in / https://www.youtube.com/@aadabhyderabadtv)

- Advertisement -
RELATED ARTICLES

Latest News