Homeవరంగల్‌DCC President | డిసిసి అధ్యక్షుడిగా ఇనుగాల.

DCC President | డిసిసి అధ్యక్షుడిగా ఇనుగాల.

  • పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

హన్మకొండ డిసిసి అధ్యక్షుడిగా ఇనుగాల వెంకటరామి రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల సమాచార శాఖల, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి గార్లతో కలిసి పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.

అనంతరం గత 15 సంవత్సరాలుగా హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన మాజీ డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కి ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, హన్మకొండ డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఇనుగాల వెంకటరామిరెడ్డి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమర్థవంతంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు.

- Advertisement -
Enagala Venkatram Reddy Takes Charge As DCC President0

పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ రియాజ్, మేయర్ సుధారాణి, టిపిసిసి ఉపాధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ ఇంచార్జిలు, నియోజకవర్గ ఇంచార్జిలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News