Friday, January 16, 2026
EPAPER
Homeవరంగల్‌Devotees | శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.

Devotees | శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.

  • గురుస్వామి బాల్య కాంతయ్య ఆధ్వర్యంలో

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి చెందిన 25 మంది అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరి, స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇరుముడులు కట్టుకొని పూజలు నిర్వహించారు. బంధు మిత్రులతో గుడి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఈ సందర్భంగా మాల ధారణ చేసిన అయ్యప్ప స్వాములు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చిన స్థానికులకు, బంధుమిత్రులకు వడ్డించారు. గ్రామస్తులందరూ ఆయు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధన చేసి శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి బాల్య కాంతయ్య, మాలధారణ స్వాములు బాల్య పృద్వి, తాడికొండ ఏకాంబరం, కేదారి, రాజు, మణికంఠ, దయాకర్, యాకయ్య, అఖిల్, రాజు, మహేందర్ తదితరులు బయలుదేరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News