Wednesday, January 14, 2026
EPAPER
Homeఅంతర్జాతీయంAmerica | స్పీకర్‌ను కలిసిన భారత రాయబారి

America | స్పీకర్‌ను కలిసిన భారత రాయబారి

అమెరికాలో భారత రాయబారి(Indian Ambassador to US) వినయ్ క్వాత్రా(Vinay Kwatra).. హౌస్ స్పీకర్(House Speaker) మైక్ జాన్సన్‌(Mike Johnson)ను క్యాపిటల్ హిల్‌(Capitol Hill)లో కలిశారు. పహల్గామ్ దాడి అనంతరం ఇండియా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల(Counter-Terrorism Efforts)కు సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలపై చర్చించారు. “ఈరోజు క్యాపిటల్ హిల్‌లో స్పీకర్ మైక్ జాన్సన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నా. ఇండియా-అమెరికా ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఆయన మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని క్వాత్రా ఎక్స్‌లో పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత మన దేశం చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు సంఘీభావం తెలిపినందుకు జాన్సన్‌కి కృతజ్ఞతలు తెలిపానని క్వాత్రా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News