- డిప్యూటీ కమిషనర్ సుదాంష్
మంచినీటి సమస్య పరిష్కారాని త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ సుదాంష్ తెలిపారు, బుధవారం ఆయన ఘనపూర్ నుండి మేడ్చల్ వరకు ఉన్న మొత్తం తాగునీటి సరఫరా లైన్లను HMWS&SB మిషన్ భగీరథ సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు,ఈ సందర్భంగా కమిషనర్ సుదాంష్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో నీటి సరఫరాలో ఉన్న లోటుపాట్లను సమీక్షిస్తున్నామని అన్నారు.
పైప్‌లైన్లలో ఉన్న లోపాలు, లీకేజీలు మరియు మరమ్మతుల అవసరాన్ని గుర్తించి, వాటిని అత్యవసరంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. అదనంగా, నీటి సరఫరా మెరుగుపరచడానికి తక్షణ, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా శుద్ధమైన తాగునీరు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తదుపరి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి, నీటి సరఫరా సమస్యలపై సమగ్రంగా చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో మహేందర్ డీఈ, మిషన్ భగీరథ, శ్రీదేవి ఏఈ, మిషన్ భగీరథ, సుబ్రహ్మణ్యం ఎస్‌ఈ, HMWS&SB, ప్రమీల ఈఈ, HMWS&SB అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
