Wednesday, December 10, 2025
EPAPER
Homeఆరోగ్యంDiarrhea | డయేరియా కేసులపై సీఎం ఆరా

Diarrhea | డయేరియా కేసులపై సీఎం ఆరా

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదవడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరా తీశారు. దీంతో ఆ గ్రామంలోని పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. ‘తాళ్లవలసలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు అస్వస్థతకు గురవగా వారిని టెక్కలి (Tekkali) ఆసుపత్రికి తరలించారు. సోమవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారు. బాధితులు వేర్వేరు కుటుంబాలకు చెందినవారరు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.

ముగ్గురు డిశ్చార్జ్ (Discharge) అయ్యారు. చిన్నారావు (70) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కానీ.. అతని మృతికి డయేరియా కారణం కాదు. కిడ్నీ వ్యాధి(Kidney Disease)తో బాధపడేవాడు. మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ (Multi-Organ Dysfunction) వల్ల గుండెపోటు వచ్చి చనిపోయాడు.

- Advertisement -

ఆ గ్రామంలో ఓ బావి ద్వారా 5 పబ్లిక్ కుళాయిలకు నీటి సరఫరా అవుతోంది. మరో 2 చేతి పంపుల నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని RWS ద్వారా పరీక్షించగా, ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమేనని తేలింది. అయినా.. ముందుజాగ్రత్త చర్యగా బావి నుంచి నీటి సరఫరాను నిలిపివేశాం. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.

జిల్లా పంచాయతీ ఆఫీసర్, SE(RWS) క్షేత్రస్థాయిలో ఉండి పారిశుధ్యం, నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. డయేరియా ప్రబలడానికి గల కారణాన్ని కనుగొనేందుకు డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తున్నారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి’ అని అధికారులు వివరించారు.

దీనిపై స్పందించిన సీఎం.. తాళ్లవలస గ్రామస్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని ఆదేశించారు. గ్రామస్థులకు సరఫరా అయ్యే నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా? లేక, ఇతర కారణాలా? అనేది విశ్లేషించాలి. గ్రామస్థులకు సురక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News