- లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి ధ్వంసం..
- మానసిక ఆందోళనలో రైతాంగం
మాయదారి మొంథా తుఫాన్ వరంగల్ జిల్లాలో మొత్తం పంటలను ముంచేసింది. ఆరుగాల కష్టపడి నాటు వేసి విత్తనాలు వేసిన రైతాంగం పంట కోసే దశకు వస్తున్న నేపథ్యంలో మాయదారి తుఫాన్ తాకిడితో వరి పంట పూర్తిగా నేలమట్టం అయింది. పత్తి పంట పూర్తిగా మొలకెత్త సాగింది. మొక్కజొన్న సైతం తడిసి ముద్దయి మొలకెత్తుటకు సిద్ధంగా ఉంది. ఆదిలోనే హంసపాదు ఉన్నట్లు నగదు పంటలైన ఎర్ర బంగారం మిర్చి పంట సైతం ఈ తుఫాను తాకిడికి ఆకులు కూడా లేకుండా పంట మొదట్లోనే భూవర్పణం జరిగింది. మొదట్లో ఆంధ్రకు పరిమితమై తెలంగాణకు కొద్దిపాటి ప్రమాదం ఉందని సూచించిన వాతావరణ శాఖ బుధవారం కురిసిన వర్షంతో ఆంధ్ర నుండి తెలంగాణ వైపు దూసుకొచ్చిందని ప్రచారం చేయడంతో రైతులు వాతావరణ శాఖ అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు.


ఎక్కడో ఢిల్లీలో ఉండి హైదరాబాదులో ఏం జరుగుతుందో శాటిలైట్ ద్వారా తెలుసుకున్న శాస్త్రజ్ఞులు వాతావరణాన్ని పూర్తిగా గమనించలేక అర్ధ రహితమైన ప్రకటనలు చేస్తూ రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని పలువురు రైతులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిన చంద్రమండలం పై విస్తృత పరిశోధనలు చేస్తున్న కాలంలో వాతావరణం గురించి ముందే ఎందుకు చెప్పడం లేదని రైతులు సవాల్ విసురుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ వద్ద కురిసిన తీవ్ర వర్షాభావానికి రైలు సైతం ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లతో బాటసారులకు తీవ్రమైన ఆటంకం కలిగించింది. వరంగల్ జిల్లాకే తలమానికంగా ఉన్న పాకాల చెరువు మత్తడివాగు నర్సంపేట నుండి మహుబూబాద్ జిల్లా డోర్నకల్ మీదుగా ప్రవహిస్తూ రహదారుల వెంట హై లెవెల

