Saturday, May 9, 2026
Homeవరంగల్‌Praja Palana | ప్రహసనంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక…!

Praja Palana | ప్రహసనంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక…!

  • అధికారుల అలసత్వం… తూ..తూ.. మంత్రంగా కార్యక్రమ నిర్వహణ…
  • ‘రైతు వారం ‘.. లేదు ఆయా రామ్… గయా రామ్…
  • సమాచారం ఇవ్వకుండా కార్యక్రమ నిర్వహణ, పొంతనలేని ప్రకటనలు : యువ రైతు పోకల శంకర్ ఆరోపణ

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్రంలో ప్రజా పాలన ప్రగతిప్రాణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వారములో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఈనెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించాల్సిన మండల వ్యాప్త సమావేశాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు శుక్రవారం తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల సర్పంచులకు గ్రామపంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తూముల నిర్వహణ నిర్వహించే విఆర్ఎలు కు సమాచారం ఇచ్చి రైతులతో నిర్వహించాల్సిన ప్రత్యేక సభను మండల వ్యాప్తంగా ఏ అధికారి లేకుండా “తక్కువ ధరకు జీలుగు విత్తనాలు ఇస్తున్నామని పిలిచి ఆరుగురు ఆంజనేయ స్వాములతో సభ నిర్వహించడం గమనార్వం..

“ఇరిగేషన్ డి.ఈ రాజు పై గతంలో కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నా కానీ ఏ ఉన్నతాధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని మండల వ్యాప్తంగా రైతులు చర్చించుకుంటున్నారు. గత సంవత్సరం పర్వతగిరి మండలం లోని రిజర్వాయర్, పలు చెరువులలో చేపలు పట్టడానికి నీటిని వృధాగా వదిలిపెట్టిన అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, ఎస్టి సెల్ అధ్యక్షులు భాస్కర్ నాయక్, చల్లా వెంకటేశ్వర్లు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎలాంటి సమాచారం లేదు- యువరైతు పోకల శంకర్..

మండల వ్యాపంగా నిర్వహించాల్సిన నీటిపారుదల శాఖ ఆయకట్టు శాఖ సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా స్థానిక ఇరిగేషన్ అధికారులు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొందరితో మాత్రమే సమావేశం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సంబంధిత అధికారులపై ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News