మాది ప్రజా ప్రభుత్వం.. రైజింగ్ తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ గారూ.. కేవలం ప్రకటనలకే మీ మాటలు పరిమితమైపోతున్నాయి.. నిరుద్యోగులు వయసుమీరిపోయి అలసి పోయి.. మరణాన్ని చవిచూస్తున్నారు.. రైతులు ఎటుపోవాలో తెలియక లబోదిబోమంటున్నారు..పురుగుల మందు తాగుతున్నారు.. ఉద్యోగులు ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.. రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోయింది.. కూలీలు ఇక్కడ బ్రతకలేక వెళ్లిపోతున్నారు.. దీనిపై ఆధారపడ్డ ప్రతి కుటుంబం పస్తులతో గడుపుతోంది.. ఒక్కటేమిటి అన్ని రంగాలూ నిర్వీర్యం అయిపోయాయి.. 3 ట్రిలియన్ ఎకానమీ కాదు.. ప్రతి ఒక్కరికీ మూడుపూట్లా అన్నం దొరికే ప్రణాళిక రూపొందించండి సార్.. !
- ఓ అభాగ్యుడి ఆవేదన..
- Advertisement -
