Homeఆదిలాబాద్Koyyala Emaji | రైతుల జోలికెళ్తే దాడులు తప్పవు

Koyyala Emaji | రైతుల జోలికెళ్తే దాడులు తప్పవు

  • బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి హెచ్చరిక

గత అనేక సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకొని వారిని వేధిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తే అటవీశాఖ అధికారులపై రైతులు దాడులు చేయడానికి కూడా వెనుకాడరని బిజెపి రాష్ట్ర నేత, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి హెచ్చరించారు.

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నెన్నెల శివారులోని సర్వే నెంబర్ 671, 672 లో సుమారు 1500 ఎకరాలు ప్రభుత్వ భూమి ( పరంపోగు)లో గత ముప్పై ఏళ్లుగా అనేక మంది రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. వారికి ప్రభుత్వం పట్టాలు కూడా మంజూరు చేసిందని తెలిపారు. అప్పటి నుండి రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. కానీ అటవీశాఖ అధికారులు ఇటీవల జోక్యం చేసుకొని రైతుల పై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

వారిని చేలల్లో వెళ్లకుండా సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. దీనివల్ల పేద రైతులు కష్టాలు పడుతున్నారని అన్నారు. వారికి అన్ని హక్కులున్నా అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం శోచనీయం అన్నారు. అటవీశాఖ అధికారులు రైతుల జోలికి పోవద్దని హెచ్చరించారు. అటవీశాఖ కార్యాలయాని బాధిత రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ రోజు రైతులతో కలిసి వారి భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కేశవరెడ్డి, శైలేందర్ సింగ్, గోవర్ధన్, శ్రావణ్ కుమార్, రైతు కూలీ సంఘం నాయకులు రత్నం తిరుపతి, బనేష్, శివలింగయ్య, మొహిద్ ఖాన్, గంగారాం, సునీత, బొండయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News