- చాకచక్యంగా తొలగించిన కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నవీన్ ఆడెపు.
భోజనం చేస్తుండగా గొంతులో చికెన్ ఎముక ఇరుక్కున్న సంఘటన మంచిర్యాల లో చోటు చేసుకుంది. జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన 45 సంవత్సరాల మహిళ నిన్న రాత్రి భోజనం చేస్తుండగా చికెన్ ఎముక గొంతులో ఇరుక్కోవడం జరిగింది. మహిళ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నవీన్ పాడెపు దగ్గరికి తీసుకు వచ్చారు.

డాక్టర్ నవీన్ వైద్య పరీక్షలు నిర్వహించి గొంతులో ఇరుక్కున్న చికెన్ ఎముకని ఎండోస్కోపీ ద్వారా చాక చక్యంగా తొలగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు డాక్టర్ నవీన్ ఆడెపుకి కృతజ్ఞతలు తెలిపారు..
- Advertisement -
