Friday, May 15, 2026
Homeరంగారెడ్డిNEET | నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్య మంత్రి బాధ్యత వహించాలి

NEET | నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్య మంత్రి బాధ్యత వహించాలి

  • సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్*

దేశ వ్యాప్తంగా వైద్య విద్యని అభ్యశించటానికి నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజి కావటానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ నీట్ పరీక్షని దేశ వ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు వ్రాశారని, ఇప్పుడు వాళ్ల జీవితం ఆగమ్య గోచరంగ మారిందని అన్నారు.

ఈ చర్య వల్ల డాక్టర్ కావాలనే ఆశతో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల ఆశల మీద నీళ్లు చెల్లినట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పేపర్ లికేజి కి పాల్పడిన కార్పొరేట్ విద్య మాఫియా పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విద్య రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News