Friday, May 15, 2026
Homeఆదిలాబాద్Bellampalli | బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Bellampalli | బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

ప్రజల రక్షణ,భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని,శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని బెల్లంపల్లి 1 టౌన్ ఎస్ హెచ్ ఓ కె.శ్రీనివాస్‌రావు అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు

బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో శుక్రవారం తెల్లవారుజామున బెల్లంపల్లి బస్తీ ,లో ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఇందులో భాగంగా బస్తీలోని అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రాంతానికి కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు,06 ఆటోలను సీజ్ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన సాధ్యమన్నారు. బస్తీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు రహస్యంగా సమాచారం అందించాలని కోరారు.యువత గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కాలనీల స్వీయరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 20 మంది పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News