Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu | విజేతలకు అభినందనలు..

Chandrababu Naidu | విజేతలకు అభినందనలు..

  • జాతీయ చలనచిత్ర పురష్కారాలపై నారా చంద్రబాబు స్పందన..
  • సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల..

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన విజయాలపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల అసాధారణ ప్రతిభ మన సినిమాకు గొప్ప గర్వకారణంగా నిలిచిందని చంద్రబాబు కొనియాడారు. “కళ, సంస్కృతి, సినిమా మన అస్తిత్వానికి, వారసత్వానికి బలమైన మూలస్తంభాలు.

తెలుగు సినిమా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తరతరాలకు స్ఫూర్తినివ్వాలి” అని ఆయన తన పోస్టులో ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అవార్డులు గెలుచుకున్న వారందరూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తన పోస్ట్‌లో ప్రముఖ నటులు మమ్ముట్టి, యామీ గౌతమ్, కార్తీక్ ఆర్యన్, నిహారిక కొణిదెల, దర్శకుడు సుకుమార్‌లను ట్యాగ్ చేయడం విశేషం. దీంతో పాటు ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’, ‘లక్కీ భాస్కర్’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జతచేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News