మండల పరిధిలోని సూరవీడు పంచాయతీ రామాంజపురం గ్రామంలో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు, సేంద్రియ వ్యవసాయ(Organic Farming) పద్ధతులు, సహజ ఎరువుల తయారీ మరియు ఇంటి కిచెన్ గార్డెన్ నిర్వహణపై అవగాహన కార్యక్రమం కార్పెట్ స్వచ్ఛత సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారి శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ పథకాలైనా రైతు బందు, రైతు బీమా, సబ్సిడీ పథకాలు, విత్తనాలు మరియు ఎరువుల సాయం, వ్యవసాయ యంత్రాల సబ్సిడీ, వాటివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
సేంద్రియ ఎరువులు, కంపోస్ట్ మరియు వర్మీ కంపోస్ట్ తయారీపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు .ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు మరియు ఇతర పంటలను సేంద్రియ పద్ధతిలో పెంచే విధానాలను, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, కుటుంబాలకు పోషకాహారం అందించడంలో ఇంటి కిచెన్ గార్డెన్ ప్రాధాన్యతను వివరించారు.

ఈ అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం ద్వారా రైతులు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సేంద్రియ వ్యవసాయ(Organic Farming) పద్ధతులను ఆచరించే అవకాశం కలుగుతుందన్నారు. ఇంటి వద్ద లభించే సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి ఎరువులను తయారు చేసుకోవడం, తక్కువ ఖర్చుతో కూరగాయలు మరియు ఆకుకూరలను పండించడం గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వివిధ రకాల కూరగాయల విత్తాలను సేకరించి చూపించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, వాజేడు కోఆర్డినేటర్ జి కామేష్, వెంకటాపురం కోఆర్డినేటర్ హనుమంత్, యానిమేటర్స్ నరేష్, ప్రశాంత్, ఇందిరా, ఉషా, పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
