ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని నూగూరు, వెంకటాపురం, శాంతినగర్, పాత్రాపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారుగా 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు, పలకలను వెంకటాపురం పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి జీవి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ(Bags Notebooks Distribution,) చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో పేద విద్యార్థుల పట్ల ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రేస్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు బిషప్ మారినేని జాకబ్ ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మురళీకృష్ణ రెడ్డి, కల ప్రసాద్, ముర్రం రాజేష్, కంతి ముత్తయ్య , లక్ష్మణరావు, అదిశివ, విద్యార్థుల తల్లిదండ్రలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
