- చికిత్స అందించి పసి ప్రాణం కాపాడిన వైదేలు..
- శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి..
సంగారెడ్డి పట్టణంలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్(Shishu Raksha Hospital) డాక్టర్లు అరుదైన చికిత్స అందించి నవజాత శిశువు ప్రాణాలను కాపాడారు. నెలలు నిండకముందే, కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు పునర్జన్మనిచ్చారు. ఊపిరితిత్తులు డెవలప్ కాకపోవడంతో పాటు కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. వెంటిలేటర్ పై శిశువును ఉంచి విజయవంతంగా చికిత్స అందించారు. 50 రోజుల చికిత్స తర్వాత ఆ పసి బిడ్డ బరువు 1.6 కిలోలకు పెరిగింది.
ఆసుపత్రికి వెళ్లి అభినందించిన జగ్గారెడ్డి :
అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న నవజాత శిశువును శిశురక్ష ఆసుపత్రి డాక్టర్లు బతికించారని తెలుసుకున్న జగ్గారెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లారు. నవజాత శిశువును చూసి, డాక్టర్లను ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. హైదరాబాద్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డి లోనే అత్యాధునిక వైద్య సేవలు అందించి, పసిబిడ్డకు ప్రాణం పోసిన తీరును ఆయన ప్రశంసించారు. శిశు రక్ష ఆసుపత్రి డాక్టర్లు ఆ శిశువును కంటికి రెప్పలా కాపాడి, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం నింపారని ఆయన వివరించారు.
సగం బిల్లు మాత్రమే తీసుకున్న ఆసుపత్రి యాజమాన్యం :
50 రోజుల చికిత్స కు గాను దాదాపు నాలుగు లక్షల పైగా బిల్లు అయింది. శిశువు తల్లిదండ్రులు రెండు లక్షల వరకు చెల్లించారు. మిగతా మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం బిల్లులో సగం మినహాయింపు ఇచ్చింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
