Monday, May 11, 2026
Homeరంగారెడ్డిProtest | మేడ్చల్లో బి ఆర్ ఎస్ నాయకులు..

Protest | మేడ్చల్లో బి ఆర్ ఎస్ నాయకులు..

  • బండి భగీరథని అరెస్టు చేయాలంటూ చిత్ర పటం దగ్ధం

మైనర్ బాలికను లైంగిక వేధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే ఆరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బండి సంజయ్, బండి భగీరధ కలిసి ఉన్న చిత్ర పటాన్ని దగ్ధం చేసి, ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బాధ్యత గల పదవీలో ఉన్న బండి సంజయ్ తన కొడుకు బండి భగీరధ మైనర్ బాలికను వేధిస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. బండి భగీరథపై పోక్సో కేసు నమోదై రెండు రోజులైనా ఆరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడం లేదన్నారు. మహిళలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల హయాంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో షీ టీంను ఏర్పాటు చేసి, మహిళలను కన్నబిడ్డల్లా రక్షణ కల్పించారన్నారు.

- Advertisement -

బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్

బండి సంజయ్ కు ఏమైనా బాధ్యత ఉంటే వెంటనే తన మంత్రి పదవీకి రాజీనామా చేసి, తన కొడుకును పోలీసులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ తమ ఇంటి నుంచే మహిళలకు రక్షణ లేకుంటే ఊరును ఏమి ఉద్దరిస్తారని ప్రశ్నించారు. మీకు బాధ్యత ఉంటే వెంటనే బండి భగీరథను పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిఖితా రెడ్డి,మాజీ కాప్షన్ నవీన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ వెంకటేశం, నాయకులు దయానంద్ యాదవ్, నర్సింగ్ గౌడ్, విష్ణు చారి,రఘుపతి రెడ్డి,రఘు, చిట్టిమిల్ల రాగజ్యోతి, చిట్టిమిల్ల గణేశ్, హరత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నడికొప్పు నాగరాజు, సంజీవరావు, విఠల్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News