- ఊరికి అరిష్టమా లేక రాజకీయ చదరంగం మా
జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ లో గల పెద్దగుట్ట రంగనాయక స్వామి దేవాలయం(Ranganayaka Swamy Temple) చాలా చరిత్ర గల మహి మాన్విత దేవాలయంలో రాజకీయ చదరంగం మొదలైంది. రెండు సంవత్సరాల క్రితం ఒక విధ్వంసానికి గురై చేరుకునే లోపే చైర్మన్ ముసుగులో ఉన్న వ్యక్తి రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టాడు. సమస్యకు మొదటి కారణం కమిటీ సభ్యుల్లో ఒకరైన కాల్వ రామ్ రెడ్డి ఇతను గత రెండు సంవత్సరాల నుంచి ఆలయ కమిటీ చైర్మన్ కావాలని ఆశతో పైరవి చేయించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని కలవడం జరిగింది.
అభివృద్ధి జరుగుతుందని అనిరుద్ రెడ్డి ఆలయాన్ని ఎండోమెంట్లో కలిపి కమిటీ సభ్యులుగా నియమించాడు కమిటీ సభ్యులుగా వంశీకృష్ణ చారి, కావాలి రాములు, లక్ష్మమ్మ, సుంకసారి బుచ్చి లింగం, కాల్వ రామ్ రెడ్డి లను కమిటీ సభ్యులుగా నియమించారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన రామ్ రెడ్డి తను చైర్మన్ అని వ్యక్తిగతంగా ప్రకటించుకున్నాడు. గుట్టపై తన ఆధిపత్యాన్ని చూపడానికి తన ప్రచారాన్ని గుట్టపై నుంచి మొదలుపెట్టడు. గుట్టపై జరిగిన విధ్వంసం తరువాత ఇతను చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు కాదనలేకపోయారు. అయితే ఎండోమెంట్లో కలిసిన ఈ దేవాలయంలో కమిటీ సభ్యులుగా కాకుండా తానే చైర్మన్గా ఉన్నానని ప్రచారం చేసుకున్నాడు.
దీనిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మందలింపు గిట్ల గురయ్యాడు. అయినా అతని వ్యవహార శైలి మారలేదు. గజస్తంభ ప్రతిష్టాపన లో భాగంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నీ కలిసి తాను గజ స్తంభ ప్రతిష్టాపన చేస్తున్నట్టు తెలియజేస్తే ఎమ్మెల్యే వద్దని చెప్పడం జరిగింది. ఎండోమెంట్ నుంచి గాని ఊరి పెద్దల నుంచి గాని వేద పండితుల నుంచి గాని ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోకుండా ఒంటి ఎద్దు పోకడ గా వివరించారు. ఇటువంటి అనుమతులు లేని ప్రతిష్టాపను ఎండోమెంట్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై కమిటీ సభ్యులు రామ్ రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఆరోపణలు జరిపారు. దీనిపై ఎమ్మెల్యేను వివరణ తను దైవ కార్యాలకు వ్యతిరేకం కాదని ఊరి పేదల సమక్షంలో ఉత్సాహంగా నిర్వహిస్తామని తెలిపారు.
కానీ కమిటీ సభ్యుడు రామ్ రెడ్డి దీన్ని రాజకీయ కోణంగా మార్చేశాడు. కరపత్రాల్లో ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎమ్మెల్యే లు ఉన్నారని గజస్తంభా ప్రతిష్టాపన ఆపారని ఎమ్మెల్యే అనిరుద్రుడిపై ఆరోపణలు జరిపారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఫోన్ చేయగా కాల్వ రామ్ రెడ్డి అనే వ్యక్తి దేవుని పేరు చెప్పి గుట్టకు మెట్లు కట్టిస్తానని 2000 గడపకు వసూలు చేస్తున్నాడు. దీనికి ఎండోమెంట్ తరఫునుంచి గాని ఎటువంటి రసీదు ఇవ్వలేదు బ్యాంకు ఖాతాలో జమ చూపలేదు దీనిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రామ్ కాల్వరామ్ రెడ్డిని మందలించడం జరిగింది. కాల్వ రామ్ రెడ్డి మునస్థాపంతో దీనికి రాజకీయరంగులు పులిమారు కమిటీ సభ్యులు మిగతా వాళ్ల నువ్వు వివరణ కోరగా ముమ్మాటికి ఇది రామిరెడ్డి తప్పిదం అని తెలియజేసి రాజీనామాలు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
