- మంత్రి పొన్నం
సిద్దిపేట జిల్లా.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్.. హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల సరిహద్దుతో ఉండడంతో.. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ ఆడిషన్ కలెక్టర్ లు, ఆర్డీవోలు, డీఎస్ వో లు, డిఎం సివిల్ సప్లయ్ అధికారులు, ఎమ్మార్వో లు, వ్యవసాయ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంచార్జీలు, గ్రామాల వారిగా ధాన్యం కొనుగోలు కమిటీలతో.. మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్..
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలి, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగ్స్ కొరత రాకుండా చూసుకోవాలి, సాయంకాలం వర్షాలు ధాన్యం తడవకుండా రైతులకు టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం ఇటీవల వర్షానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, ప్రతి గ్రామానికి వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలి. కొనుగోలు కేంద్రాల్లో ఏ సమస్య వచ్చిన మా కార్యాలయ దృష్టికి తీసుకురండి, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొనుగోలు విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మిల్లుల వద్ద సమస్యలు రానివ్వకూడదు.
ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలుపై, కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం పై మానిటరింగ్ చేయాలి. ధాన్యం తరలింపులో వాహనాల సమస్య రానివ్వకూడదు, ప్రతి జిల్లాకు ఒక ఏంవిఐ అధికారిని ప్రత్యేకంగా వాహనాలు తరలించడానికి కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేయాలని డిటిసిలకు ఆదేశాలు.
హామలీల కొరత లేకుండా చూసుకోవాలి.
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అడుగు పెట్టేంత స్థలం లేకుండా ధాన్యం వస్తున్నందున ఇప్పటికే ఐదు బృందాలు కాంట వేస్తున్నందున అదనంగా ఏర్పాటు చేయాలి. ఏ గ్రామం నుండి ఏ సమస్య వచ్చిన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఏఈవో, గ్రామ కమిటీ కో ఆర్డినేట్ చేసుకోవాలి. ప్రధానంగా ధాన్యం అధికంగా వచ్చే అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్, కోహెడ, బస్వాపూర్, శనిగరం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
శనిగరంలో రోజుకు 3-4 లారీలు వస్తున్నాయి, అదనంగా లారీలు లేదా ట్రాక్టర్ లను ఉపయోగించాలి.
ఇక నుండి డే బై డే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తాను..
