- డాక్టర్ రఘు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై చర్చ
జగిత్యాల: తెలంగాణ రక్షణ సేన(TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ని హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకుడు డాక్టర్ చిట్నేని రఘు ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై చర్చించారు.
నియోజకవర్గంలో నూతన కమిటీల నియామకాలకు ఆమోదం తెలిపినందుకు కవితకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ, మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో తెలంగాణ రక్షణ సేనను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
