కరీంనగర్: కరీంనగర్ కన్జ్యూమర్ ఫీల్డ్ పోర్స్ అసోసియేషన్ (KCFFA) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం కరీంనగర్లోని శుభమంగళ బ్యాంకెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా అక్కు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా రమేష్, కోశాధికారిగా కొలిపాక వినేష్, కార్యదర్శిగా శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా సరీన్ ప్రమాణ స్వీకారం చేశారు.

కమిటీ సభ్యులుగా సంపత్, రాజేష్, మధు, వెంకటేష్, రాజు స్వస్తిక్, రంగవేణి శ్రీను,రాము, అనిల్, సాయి కోయాస్,రవి సన్సోలైట్, సంతోష్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పిట్టల మధు మాట్లాడుతూ, సభ్యులందరూ ఐక్యంగా పనిచేస్తూ అసోసియేషన్ సభ్యుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తూ సమిష్టిగా మనమందరం అసోసియేషన్ ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,మీడియా కన్వీనర్ చిట్టిమల్ల మహేందర్, కాడర్ల శ్రీనివాస్, నాగరాజు, రాజు, అనిల్ కుమార్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
