Homeరంగారెడ్డిSaddula Bathukamma | సంప్రదాయాల సోయగం.. బతుకమ్మల వైభవం!

Saddula Bathukamma | సంప్రదాయాల సోయగం.. బతుకమ్మల వైభవం!

  • తీరొక్క పూలతో బతుకమ్మల అలంకరణ..
  • ఆటపాటలతో అంబరాన్నంటిన సంబరాలు
Kadthal Saddula Bathukamma Celebrations Reflect Telangana Culture3
Kadthal Saddula Bathukamma Celebrations Reflect Telangana Culture4

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు,యువతులు తీరొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి,భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.బతుకమ్మ పాటలు,మహిళల ఆటపాటలతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ రకాల పూలను సేకరించిన మహిళలు వాటిని వరుసలుగా పేర్చి ఆకర్షణీయమైన బతుకమ్మలను రూపొందించారు.అనంతరం ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడారు.కోలాటాలు,ఆటపాటలతో సందడి చేస్తూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.

పలు ప్రాంతాల్లో బతుకమ్మ సందడి

Kadthal Saddula Bathukamma Celebrations Reflect Telangana Culture2
Kadthal Saddula Bathukamma Celebrations Reflect Telangana Culture5

కడ్తాల్‌ మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయం, కెనరా బ్యాంక్‌ కాలనీ, రమేష్‌ అయ్యగారి నివాస ప్రాంతం, యూనియన్‌ బ్యాంక్‌ కాలనీలలో బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని బతుకమ్మలను అందంగా అలంకరించి పూజలు చేశారు. రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం బతుకమ్మను గ్రామ సమీపంలోని దేవర కుంట చెరువులో, కొంతమంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేశారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

- Advertisement -

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేకతకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మలను పూజిస్తూ తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. పల్లె సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తోంది. కడ్తాల్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలతో మహిళల్లో నూతనోత్సాహం నెలకొనగా, సంప్రదాయ దుస్తులు ధరించి పూల బతుకమ్మలతో పాల్గొన్న ఆడపడుచుల సందడితో ఆయా ప్రాంతాలన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News