Homeకరీంనగర్Inspection | ఆహార తయారీ కేంద్రాల్లో రాష్ట్ర విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Inspection | ఆహార తయారీ కేంద్రాల్లో రాష్ట్ర విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

  • మసాలాలు, ఆహార దినుసుల నమూనాలు సేకరణ

జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయిపల్లి సమీపంలో ఉన్న రోజ్ స్పైసెస్, రాజరాజేశ్వర ఇండస్ట్రీస్‌లో రాష్ట్ర విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ(Food Safety Officials) అధికారులు ఆకస్మిక తనిఖీలు(Inspection) నిర్వహించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార దినుసులు, మసాలా ఉత్పత్తుల నమూనాలను సేకరించారు. సేకరించిన శాంపిళ్లను పరీక్షల నిమిత్తం సంబంధిత ల్యాబ్‌లకు పంపించనున్నట్లు తెలిసింది. ఆహార పదార్థాల నాణ్యత, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ తనిఖీలు(Inspection) చేపట్టారు. ల్యాబ్ పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

ఆకస్మిక తనిఖీలతో ఆయా పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News