- ప్రధానోపాధ్యాయుడు బి.శివరావు జీతంలో కోత
కూసుమంచి మండలంలోని నరసింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీల పై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల విషయాన్ని ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తీసుకువచ్చింది.ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా విద్యాధికారిణి డా.పి.శ్రీజ విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడు ని సస్పెండ్ చేయగా,ప్రధానోపాధ్యాయుడు బి.శివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.తాజా గా ఈ విషయంలో జిల్లా విద్యాధికారిణి మరికొందరి ఉద్యోగుల పై కొరడా ఝులిపించారు.విధుల్లో అలసత్వం ప్రదర్శించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శివరావు పై ఆమె చర్యలు తీసుకున్నారు.ఆదాబ్ హైదారాబాద్ పత్రికలో వార్త కథనం ప్రచురితమయ్యే వరకు ఉన్నతాధికారులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించడంతో అక్టోబర్ 23 నుండి 27 వరకు ఐదు రోజుల వేతనాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
