Homeనల్లగొండWelcome | హైదరాబాద్‌కు చేరుకున్న బొక్క వసుమతి–జైపాల్ రెడ్డి దంపతులు

Welcome | హైదరాబాద్‌కు చేరుకున్న బొక్క వసుమతి–జైపాల్ రెడ్డి దంపతులు

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల సందడి..
  • పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం

బీబీనగర్: విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొక్క వసుమతి, జైపాల్ రెడ్డి దంపతులకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం(Welcome) పలికారు.తమ అభిమాన నాయకులు స్వదేశానికి చేరుకోవడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. దీంతో విమానాశ్రయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా బొక్క వసుమతి, జైపాల్ రెడ్డి దంపతుల పట్ల తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పార్టీ శ్రేణులు చాటుకున్నారు. నాయకులతో ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రదర్శించారు.ఈ స్వాగత కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News