- సంక్రాంతి తరువాత ఉహించని నిధులు..Cheyutha Pensions
- రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్
- గొల్లపల్లి మండల కేంద్రంలో చేయూత పింఛన్లు మంజూరి పత్రాలు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి..Cheyutha Pensions
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు అందజేస్తామని, కొత్త పింఛన్ల పంపిణీ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసే ప్రజా ప్రభుత్వానిది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రోసిడింగ్ లతో పాటు కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.Cheyutha Pensions
ఈసందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 200 యూనిట్లకు పేదల తరుపున ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులకు రేషన్ కార్డులు అందజేయడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.Cheyutha Pensions
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామని మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయూత పింఛను అందించి అండగా నిలవాలని ఉద్దేశంతో కొత్త పింఛన్లు మంజూరు చేశారని అన్నారు. గొల్లపల్లి మండలానికి కొత్తగా 735 చేయూత పింఛన్లు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వారిని గుర్తించి పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
సంక్రాంతి తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి మౌలిక సదుపాయాలకు కావాల్సిన నిధులు సమీకరించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మండలం సర్పంచులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
