Homeనల్లగొండRTI Act | సామాన్యులకు సైతం సమాచారం అందాలి .. అదే ఆర్టీఐ లక్ష్యం.

RTI Act | సామాన్యులకు సైతం సమాచారం అందాలి .. అదే ఆర్టీఐ లక్ష్యం.

  • శానిటరీ ఇన్‌స్పెక్టర్ రెగ్యులర్ పోస్టు వివరాలు వెల్లడించాలి.RTI Act
  • దయానంద్ ముదిరాజ్

సామాన్య ప్రజలకు సైతం ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ప్రజాధనం వినియోగం వంటి అంశాలపై సమాచారం తెలుసుకునే హక్కు కల్పించడమే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రధాన లక్ష్యమని వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ అన్నారు.RTI Act

వనపర్తి మున్సిపాలిటీలో రెగ్యులర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు భర్తీ, సంబంధిత వివరాలపై సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారుడు మల్లికార్జున్ సమాచారం కోరినప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆయన మంగళవారం స్పందించి ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం ఉండాలని, ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రెగ్యులర్ పోస్టు మంజూరు వివరాలు, ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది, ప్రస్తుతం ఆ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు, పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐఓ), సంబంధిత ఉన్నతాధికారుల వివరాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు.

- Advertisement -

ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి పనులు, ఉద్యోగుల విధులు, ప్రభుత్వ నిధుల వినియోగంపై సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీఐ చట్టం – 2005ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తే ప్రజలకు సమాచారం ఎలా అందుతుందని ప్రశ్నించారు.

మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఆర్టీఐ దరఖాస్తుపై స్పందించని అధికారుల తీరును పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దయానంద్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News