Tuesday, April 14, 2026
Homeకరీంనగర్Abhyasotsav | అభ్యాసోత్సవ్‌లో బ్లూ బెల్స్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

Abhyasotsav | అభ్యాసోత్సవ్‌లో బ్లూ బెల్స్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

  • రాష్ట్రస్థాయిలో రాణించిన బ్లూ బెల్స్ విద్యార్థులు

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన 12వ అభ్యాసోత్సవ్ – అవార్డు కార్యక్రమంలో బ్లూ బెల్స్ హై స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లూ బెల్స్ పాఠశాల నుండి మొత్తం 19 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించగా, అందులో 5 మంది విద్యార్థులు రాష్ట్రంలో 1వ ర్యాంక్ సాధించడం విశేషం.

ప్రధానంగా 1వ ర్యాంక్ సాధించిన విద్యార్థులు:
విహారి కటుకోజ్వాల (C-BAT)
నిహాల్ తాటి (RSM)
భావగ్య మామిడి (K-SAT)
రిషినందన్ బచ్చు (K-SAT)
విహారి కటుకోజ్వాల (BVVS)
అలాగే ఇతర విద్యార్థులు కూడా 2వ, 3వ ర్యాంకులు సాధించి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు:
శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు (మాజీ చీఫ్ సెక్రటరీ
)

- Advertisement -

డా. ఏ.వి. గురవ రెడ్డి (కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్)

ప్రొఫెసర్ శాంతా సిన్హా (ఎంవీఎఫ్ ఫౌండేషన్ స్థాపకులు – బాల కార్మికత్వ నిర్మూలన & సమగ్ర విద్య కోసం కృషి చేసిన ప్రముఖులు)
విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్తుకు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు.

ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం కారణమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సునీత మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… “మా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపడం మా పాఠశాలకు గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేస్తాము” అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News