Homeఆదిలాబాద్Inspection | ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

Inspection | ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీతరంపల్లి లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ p.చంద్రయ్య తో కలిసి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు చెరవేయాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.హమాలీ కొరత,గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసుకొని అధికారులతో సమన్వయం చేసుకొని సాధ్యమైనంత ట్వారహంగా ధాన్యాన్ని చెరవేయాలి అని తెలియచేశారు.

Additional Collector Inspects Grain Procurement Center in Mancherial0

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు రవాణా కొరకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని,ధాన్యం రవాణా కొరకు అవసరమైన గన్ని బ్యాగులను,లారీలను అందుబాటులో ఉంచిందని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ ,స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సు సౌమ్యవేణు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ దర్ని మల్లేష్ ,ఐకేపీ సెంటర్ ఇంఛార్జి సురిమిల్ల వర్ష వెంకటేష్,సంబంధిత అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు,సీతారాంపల్లి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News