- నోటిఫికేషన్ విడుదల..
- అప్లికేషన్ చివరి తేదీ ఆగష్టు 21..
- వివరాలకు www.ibps.inలో చూడవచ్చు..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 11,403 క్లర్క్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని 11 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఖాళీలను 2027-28 సంవత్సరానికి భర్తీ చేస్తారు. దీనిలో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్‌లో 186 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలి ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరు ఆయా ప్రాంతపు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. భారత్‌లో శాశ్వతంగా స్థిరపడాలని పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, కెన్యా, ఉగాండా, టాంజానియా, జాంబియా, మలావి, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, వియత్నాంల నుంచి వలస వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా అర్హులు.
ఫీజు :
జనరల్ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175. ఫీజు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్, భీమ్ యూపీఐ, మాస్టర్‌కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. ఈ ఫీజు రిఫండ్ చేయరు.
ఎంపిక :
కస్టమర్ సర్వీస్ అసోసియేట్, క్లరికల్ కేడర్ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో చేసుకునే దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 21. ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.ibps.inలో చూడవచ్చు.
