- మౌలాలి డివిజన్లో దోమల బెడద.. డెంగీ, మలేరియా భయంతో స్థానికులు
మల్కాజ్గిరి నియోజకవర్గం, ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని బండ చెరువు(Banda Cheruvu) పరిసర ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీ, శివ ఆనంద్‌నగర్, డాక్టర్ కృష్ణానగర్, నానా హిల్స్, కేసీఆర్ బస్తీ, సుభాష్‌నగర్, షఫీ నగర్, షాదుల్లా నగర్ ప్రాంతాల ప్రజలు దోమల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
బండ చెరువు పరిసరాల్లో దోమల ఉత్పత్తి పెరగడంతో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దోమల నియంత్రణకు సాధారణ ఫాగింగ్‌తో పాటు బండ చెరువు ప్రాంతంలో డ్రోన్ ద్వారా దోమల నివారణ మందుల పిచికారీ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యపై ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ మౌలాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్‌రావు, ఎంటమాలజీ విభాగం అధికారులు తక్షణమే స్పందించాలని కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బండ చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి దోమల బెడదను అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
