- చెట్టును ఢీకొని అదుపుతప్పిన వాహనం.
- ఇద్దరికి తీవ్ర గాయాలు
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం బాచారం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తాండూరులో జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న రంగారెడ్డి జిల్లా కొంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారు టీఎస్, 08 జేఎన్, 3859, ప్రయాణిస్తుండగా బాచారం మూలమలుపు వద్ద ఫ్లైఓవర్ పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు అయినట్లు తెలిపారు ఒకరు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ధరూర్ సీఐ రఘురాములు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

