Homeరంగారెడ్డిMedchal | ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

Medchal | ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

  • పాల్గొన్న చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జిల్లా గ్రంథాలయ(Medchal Library) సంస్థ, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ డాక్టర్‌ మలేపుల నరసయ్య మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రక ఘట్టమన్నారు. ప్రజల స్వేచ్ఛ, హక్కులు, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల కోసం సాగిన పోరాటాల్లో ఎందరో త్యాగాలు చేశారని గుర్తుచేశారు.

- Advertisement -

ప్రజల పోరాటాలు, అమరవీరుల త్యాగాలు, ప్రజాస్వామ్య ప్రస్థానం, ప్రజా పాలన ప్రాధాన్యాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి సెప్టెంబర్‌ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, బాధ్యతాయుతమైన ప్రజా పాలనపై అవగాహన కల్పించడమే దినోత్సవం ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది శ్రీమతి నాగవేణి, పాఠకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేశ సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాఠకులు, సిబ్బంది, సంబంధిత ప్రతి ఒక్కరికీ చైర్మన్‌ బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News