Homeతెలంగాణప్రపంచ వెదురు దినోత్సవం..

ప్రపంచ వెదురు దినోత్సవం..

  • రవీంద్ర భారతి లో నిర్వహణ..
  • తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం..
  • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్..

రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ రాష్ట్ర మేదరి మహీధర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం(World Bamboo Day) కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హాజరైయ్యారు.. ఈ సందర్భంగా మేధర కులం వారు తమ కళాత్మకంగా రూపొందించిన వివిధ వెదురు వస్తువులను మంత్రి ప్రరిశీలించారు.. ఈ కార్యక్రమంలో మేదరి జీవన విధానం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ సంఘం నాయకులు , రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన మేదరి సంఘం నాయకులు శ్రీనివాస్, రాజశేఖర్, ఉమ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వెదురు దినోత్సవ(World Bamboo Day) వేడుకల్లో నన్ను భాగస్వామ్యం చేయనందుకు ధన్యవాదాలు.. నేను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుండి జెండా కట్టెల కోసం వెదురు కోసం నా మిత్రుడు రాజనర్సు ఇక్కడే ఉన్నది లక్షల రూపాయలు ఇచ్చా.. రాహుల్ గాంధీ జిత్నే ఆబాది ఉత్నే ఇసేదారి అని ఎవరెంతో వారంతా అని దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని ప్రకటించారు.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తా అని ఏప్రిల్ 2025 లో ప్రకటించారు..ఇప్పుడు బీసీల అంశాన్ని చేర్చలేదు.. తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసింది..

- Advertisement -

ఉప్పల్ బాగాయత్ లో ఉన్న మీ జాగా లో భవనం నిర్మాణం కోసం ఈనెల లోనే కట్టుకునేలా నిధులు మంజూరు చేస్తా.. ఎక్కడైనా స్థలం ఉంటే వెదురు పంచుకోవడానికి ఉపయోగించండి. మేదరి కార్పొరేషన్ మహేంద్ర కార్పొరేషన్ వేయడానికి మీరందరూ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి పేరు ఇస్తే వేస్తుంది.. మేదరి కార్పొరేషన్ చైర్మన్ అపాయింట్ చేస్తాం. వృత్తి బరా బార్ బతుకలి మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తులు మారాలి.. మన పిల్లల్ని మంచిగా చదివించాలి.. ఉన్నత స్థాయిలో మన కులం ఉండాలంటే మన పిల్లలు బాగా చదవాలి.. మన పిల్లలని మంచిగా చదివిస్తామని ఈ సమావేశంలో ప్రమాణం చేయాలి.. కుల సర్వే లో ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాలు పరిశీలిస్తే ఉన్నత చదువులు చదివిన కుటుంబాలు అభివృద్ధి చెందాయి..

నైపుణ్యం ఉండాలి.. సరైన విధంగా శిక్షణ ఉండాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి ఏ పార్టీలో లేని విధంగా స్వేచ్ఛగా కోట్లాడుతాం..అడుగుతున్నాం.. మేదరి వర్గాలు కులాలు బతకాలి.. చదువు కి సంబంధించి మరి నైపుణ్యాలు పెంచుకోవాలి.. మీకు ఏ సహకారం కలవాలన్న కులం లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఐక్యంగా ఉండి ముందుకు పోవాలి అని అన్నారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News