HomeతెలంగాణPonguleti Srinivasa Reddy | ఫాస్ట్ ట్రాక్ లో 22 - ఏ పరిష్కారం..

Ponguleti Srinivasa Reddy | ఫాస్ట్ ట్రాక్ లో 22 – ఏ పరిష్కారం..

  • ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..
  • 118 జీవో ప్ర‌కారం 19నుంచి రెగ్యుల‌రైజేష‌న్‌..
  • అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22 – ఏ కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం నాడు శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీ.ఓ.ఆర్.టి నెం. 564 ను , జారీచేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా సిసిఎల్ఎ డి.ఎస్. లోకేష్ కుమార్ వ్యవహరిస్తారు. లా సెక్రటరీ, పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటార‌ని తెలిపారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటు స‌భ్యులుగా ఆనాడు ఎల్ బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల్లో ఉన్న రెగ్యుల‌రైజేష‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు రంగారెడ్డి జిల్లాలోని ఎల్.బి. నగర్ నియోజకవర్గంలో 118 జీ.ఓ. ప్రకారం 9,700 ప్లాట్ల రేగ్యులరైజేషన్ కు సంబంధించిన మెమోను శుక్ర‌వారం నాడు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ జీ.ఓ. ప్రకారం ఆ ప్రాంతంలో రేపటి నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు.(Ponguleti Srinivasa Reddy)

- Advertisement -

దశాబ్దాల కాలంగా అక్కడ ప్లాట్లు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్న ఇండ్ల యజమానులు 118 జీ.ఓ. ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల స్ధ‌లాల రెగ్యుల‌రైజేష‌న్‌కు సంబంధించి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు హ‌యాంలో జీవో 76ను జారీ చేశార‌ని ఆ జీవోను అనుస‌రించి శ‌నివారం నాడు డిప్యూటీ సిఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి ప్రాంత ఎమ్మెల్యేల‌తో స‌మావేశం నిర్వ‌హించి రెగ్యుల‌రైజేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

అలాగే రెవెన్యూ రికార్డుల‌లో 22ఎలో ఉండి హెచ్ఎండిఎ, డిటిసిపి, జిహెచ్ఎంసీ అనుమ‌తుల‌తో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22 ఎ నుంచి తొల‌గించే విష‌యంలో ఒక‌టి రెండు రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ముఖ్యమంత్రి శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించిన 10 – 12 అంశాల‌పై నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే నిర్ణ‌యం తీసుకొని 22 ఎ ద‌ర‌ఖాస్తుదారులకు ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తామ‌ని స‌భ‌లో ప్ర‌క‌టించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News