Homeబిజినెస్Nalco | ‘డైరెక్టర్‌’గా అనిల్‌కుమార్‌సింగ్ బాధ్యతలు

Nalco | ‘డైరెక్టర్‌’గా అనిల్‌కుమార్‌సింగ్ బాధ్యతలు

కేంద్ర గనుల శాఖ పరిధిలోని నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ(Nalco) లిమిటెడ్ డైరెక్టర్(Commercial)గా అనిల్ కుమార్ సింగ్(Anil Kumar Singh) బాధ్యతలు స్వీకరించారు. నాల్కోలో చేరకముందు ఆయన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌(Hindustan Copper Limited)లో హెచ్ఆర్ విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా, మెటీరియల్స్ అండ్ కాంట్రాక్ట్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. లోహ, గనుల పరిశ్రమలోని వాణిజ్య కార్యకలాపాల్లో అనిల్ కుమార్ సింగ్‌కి 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, స్ట్రాటజిక్ కాంట్రాక్టింగ్‌లో విశేష సేవలందించారు. సింద్రిలోని బిట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌(Vishaka Steel Limited)లో మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ డివిజన్‌లో కెరీర్ ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News