Tuesday, November 11, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుAadhaar | ట్రంప్‌కి ఆధార్ కార్డ్.. ఎఫ్ఐఆర్ నమోదు..

Aadhaar | ట్రంప్‌కి ఆధార్ కార్డ్.. ఎఫ్ఐఆర్ నమోదు..

అమెరికా అధ్యక్షుడు (America President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరిట నకిలీ ఆధార్ కార్డ్‌ల(Fake Asdhaar Cards)ను తయారుచేసిన గుర్తుతెలియని వ్యక్తులపై ముంబై (Mumbai) పోలీసులు ఎఫ్ఐఆర్ (Fir) నమోదు చేశారు. అయితే ఈ చర్యను ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే (Mla) రోహిత్ పవార్ (Rohit Pawar) ‘ఫన్నీ’గా అభివర్ణించారు. నకిలీ ఆధార్ కార్డులు తయారవుతున్న విధానాన్ని, వాటి ఆధారంగా ఫేక్ ఓటర్ కార్డులు పొందుతున్న వైనాన్ని రోహిత్ పవార్ ఈ నెల 16న వెల్లడించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కానీ.. దీన్ని రోహిత్ పవార్ తప్పు పట్టారు. తనను అడిగితే వివరాలు ఇచ్చేవాణ్నని చెప్పారు.

గురువారం పూణేలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి అనంతరం ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించాల్సిందని అన్నారు. “15 రోజులు వృధా చేసిన తర్వాత వారు చేసినదంతా పనికిరాని ఎఫ్ఐఆర్ నమోదు” అని అన్నారు. ఈ నెల 16న జరిగిన విలేకరుల సమావేశంలో పవార్.. ఒక వెబ్‌సైట్‌లో నకిలీ ఆధార్ కార్డులను ఎలా తయారు చేస్తున్నారో, నకిలీ ఓటర్ల నమోదుకు ఎలా ఉపయోగిస్తున్నారో ప్రదర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News