- ప్రియుడి మోజులోపడి కళ్ళుమూసుకుపోయిన మహిళ..
- కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణం..
ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసిన ఓ మహిళ.. తన ఆరేళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. స్వతహాగా లాయర్ కావడంతో కుమార్తె మర్డర్‌ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది. కానీ చిన్నారి మరణంపై అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే ప్రియుడిని అరెస్టు చేయగా.. చిన్నారి తల్లి మాత్రం తప్పించుకుని పారిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దావణగెరెకు చెందిన పి.ప్రియాంక అనే న్యాయవాదికి 2007లో ఉపాధ్యాయుడు ప్రవీణ్ బసప్పతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (15), కుమార్తె వెనిలా(6) సంతానం ఉన్నారు. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంటుండగా.. 2025లో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 2025లో ఫ్యామిలీకి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి బెంగళూరుకు ప్రియాంక వెళ్లింది.
అక్కడ ఆమెకు తన కాలేజీ స్నేహితుడు జీఎం మోహన్ మళ్లీ కనిపించాడు. ఆ సమయంలో మోహన్ తన బాగోగుల గురించి చెబుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించానని తెలిపాడు. అప్పటి నుంచి మోహన్‌తో ప్రియాంక సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలేసింది. మోహన్‌తో సహజీవనం మొదలుపెట్టింది.
భర్తను కుమారుడి దగ్గరే వదిలేసి, కుమార్తె వెనీలాను తనతో పాటు ప్రియాంక తీసుకెళ్లింది. బెంగళూరులోని సీగెహళ్లిలో అద్దె విల్లాలో నివాసం ఉంటూ మోహన్‌తో సంబంధంలో ఉంది. అనంతరం ఇద్దరూ కాశీ(వారణాసి) వెళ్లి రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్‌కు కూడా వెళ్లొచ్చారు. 2026 జనవరిలో ప్రవీణ్ దగ్గరకు వచ్చిన ప్రియాంక.. విడాకుల పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ సమయంలో కుమార్తెను కూడా కలవనివ్వనని బెదిరించింది.
ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం కుమార్తె చనిపోయిందని ప్రవీణ్‌కు ప్రియాంక ఫోన్ చేసి చెప్పింది. మార్చి 24వ తేదీన వెనీలా పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక ఆమెను బయటకు తీసుకెళ్లింది. బిర్యానీ, ఐస్‌క్రీం తినిపించామని.. తర్వాత తను నిద్రపోతే కారులోనే ఏసీ ఆన్ చేసి ఉంచి, మోహన్‌తో తాను కాఫీ షాపునకు వెళ్లానని చెప్పింది. తిరిగి వచ్చాక ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టానని.. తెల్లారి ఉదయం వెనీలా లేవకపోవడంతో వైట్‌ఫీల్డ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారని పేర్కొంది.
