Homeకరీంనగర్Korutla Liquor Shops | అధికారులకు అంతా తెలుసు...?

Korutla Liquor Shops | అధికారులకు అంతా తెలుసు…?

  • ఎక్సైజ్ అధికారుల…. వైన్స్ నిర్వాహకుల కనుసన్నుల్లోనే అక్రమ మద్యం విక్రయాలు…?Korutla Liquor Shops
  • యదేచ్చగా బెల్టు షాపులకు మద్యం సరఫరా…!Korutla Liquor Shops
  • అధికారుల ఆదేశాలతోనే బెల్టు దుకాణాల నిర్వహణ…!Korutla Liquor Shops
  • ఎక్సైజ్ అధికారులు వైన్స్ యజమానుల తోబుచులా “ఆ”టా…?

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆదాబ్ హైదరాబాద్ పత్రికల్లో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికీ, అక్రమ మద్యం విక్రయాలపై పూర్తిస్థాయిలో నియంత్రణ కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ షాపుల నిర్వహణపై చర్చ జరుగుతున్నా, వాటికి మద్యం సరఫరా చేసే మూలాలను గుర్తించి అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారా…? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

అధికారుల పేర్లు చెబుతున్న వైన్స్ నిర్వాహకులా టా…?Korutla Liquor Shops

- Advertisement -

బెల్ట్ షాపుల నిర్వాహకులను, వైన్స్ యజమానులను ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానాలు వస్తున్నట్లు సమాచారం. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయాలని ఎక్సైజ్ శాఖకు చెందిన ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులే సూచించారని కొందరు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నట్లు ప్రజలలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

అయితే, వైన్స్ నిర్వాహకులు చెబుతున్న మాటల్లో వాస్తవమెంత…? ఎక్సైజ్ అధికారులు నిజంగానే బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయాలని సూచించారా…? లేక తమ అక్రమ వ్యాపారాన్ని సమర్థించుకునేందుకు అధికారుల పేర్లను ఉపయోగిస్తున్నారా…? అన్నది తేలాల్సి ఉంది.

బెల్ట్ షాపులకు మద్యం ఎక్కడి నుంచి వస్తోంది…?

బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, వాటికి మద్యం సరఫరా చేస్తున్న వైన్స్‌లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మద్యం ఎక్కడి నుంచి వస్తోంది…? ఎవరు సరఫరా చేస్తున్నారు…? ఏ వైన్స్ నుంచి ఎంత మొత్తంలో మద్యం వెళ్తోంది….? అనే అంశాలపై సమగ్రంగా విచారణ జరిపితే అక్రమ మద్యం సరఫరా వ్యవస్థ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఉన్నతాధికారుల విచారణతోనే నిజాలు వెలుగులోకి….!Korutla Liquor Shops

బెల్ట్ షాపుల నిర్వహణ వెనుక ఎవరెవరి పాత్ర ఉంది…? అధికారుల పేర్లు చెబుతున్న వైన్స్ నిర్వాహకులపై విచారణ జరిగిందా….? అక్రమ మద్యం విక్రయాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు…? అనే ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

అధికారుల పేర్లను ఉపయోగిస్తూ అక్రమ మద్యం వ్యాపారం సాగిస్తున్న వారైనా, నిజంగానే అక్రమ సరఫరాకు సహకరిస్తున్న అధికారులు అయినా, విచారణలో వాస్తవాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బెల్ట్ షాపులపై కేవలం తనిఖీలతో సరిపెట్టకుండా, మద్యం సరఫరా మూలాలను గుర్తించి అడ్డుకుంటేనే అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News