Homeకరీంనగర్Illegal Liquor Shops | ఎక్సైజ్ అధికారుల నిఘా నిల్....?

Illegal Liquor Shops | ఎక్సైజ్ అధికారుల నిఘా నిల్….?

  • బెల్ట్ షాపుల దందా జోర్…!Illegal Liquor Shops
  • కోరుట్ల పరిసరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపుల నిర్వహణ..!Illegal Liquor Shops
  • ఒక మోహన్ రావు పేట గ్రామంలోనే సుమారు 20 బెల్ట్ షాపులా టా…?Illegal Liquor Shops
  • బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఎక్కడి నుంచి..?
  • ఎక్సైజ్ అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి..?

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పరిసర గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండాల్సిన చోట అనధికారికంగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోరుట్ల సమీపంలోని మోహన్ రావు పేట గ్రామంలోనే సుమారు 20 బెల్ట్ షాపులు ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకే గ్రామంలో ఇన్ని బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

- Advertisement -

బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఎక్కడి నుంచి?Illegal Liquor Shops

మోహన్ రావు పేట, ఐలాపూర్ గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటికి మద్యం సరఫరా చేస్తున్నది ఎవరు…? అనుమతులు కలిగిన మద్యం దుకాణాల నుంచే మద్యం చేరుతోందా…? సరఫరా మార్గాలపై ఎక్సైజ్ శాఖకు సమాచారం లేదా…? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

Illegal Liquor Shops Near Korutla

ఎక్సైజ్ అధికారుల మౌనం ఎందుకో..?

గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.

మోహన్ రావు పేట లోనే ఇన్ని బెల్ట్ షాపులు ఉంటే కోరుట్ల చుట్టు ప్రక్కన గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టి, మద్యం సరఫరా మార్గాలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. అనధికారిక మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందిస్తారా..? బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతారా..? లేక అక్రమ మద్యం దందా యథేచ్ఛగా కొనసాగుతుందా..?వేచి చూడాలి…? (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News