మఠంపల్లి: మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ళ నుంచి పలు గ్రామాలకు లింక్ బీటీ రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ.9.40 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Uttam Kumar Reddy) కృతజ్ఞతలు తెలుపుతూ యాతవాకిళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం (Palabhishekam) నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాతవాకిళ్ళ నుంచి అల్లిపురం వరకు సుమారు 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్ల 20 లక్షలు అదే విధంగా యాతవాకిళ్ళ నుంచి చెన్నైపాలెం వరకు సుమారు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్ల 20 లక్షలు మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రహదారుల నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించి ప్రజల అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల కరుణ నాగరాజు,మఠంపల్లి మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పులి శ్రీనివాసు,గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పాలకవర్గ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
