- అధికార పార్టీ జోక్యం.. ‘రెండు’ వర్గాల సవాల్
- రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!(Election Drama)
- కాంగ్రెస్ లోని ఒక వర్గం రైస్ మిల్లర్లతో సమావేశం!
- జిల్లా అధ్యక్షునిగా సతీష్ ను గెలిపించాలని స్పష్టం
- బాదం ప్రవీణ్ గెలుపు కోసం మరో వర్గం మద్దతు
- ఎన్నికల సమయానికి ముందు ప్రవీణ్ అరెస్ట్?
- ములుగు జిల్లాలో ఉత్కంఠ రేపుతున్న “రైస్ మిల్లర్స్ అసోసియేషన్” ఎన్నికలు
ఏటూరునాగారం: ములుగు జిల్లా “రైస్ మిల్లర్లఅసోసియేషన్” ఎన్నికలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ జోక్యంతో జిల్లా ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. జిల్లా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న బాదం ప్రవీణ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం ములుగుఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పోలింగ్ ఇవ్వు కొన్ని గంటల ముందు రైస్ మిల్లర్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న బాదం ప్రవీణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
బాదం ప్రవీణ్ కు చెందిన ములుగు మండలంలో రెండు రైస్ మిల్లులో కొద్ది రోజుల క్రితం సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా బాదం ప్రవీణ్ రైస్ మిల్లుల్లో తనిఖీలు జరిపారు. తాజాగా కొద్ది రోజుల క్రితం సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు ప్రవీణ్ రైస్ మిల్లులతోపాటు మరో నాలుగు రైస్ మిల్లులో కూడా తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ తనిఖీలపై కూడా ఆసక్తికర చర్చ నడిచింది. ఎన్నికల రోజున హై డ్రామా(Election Drama) చోటు చేసుకున్నట్లు: తెలుస్తోంది.

అధికార పార్టీ జోక్యం
ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో రెండు వర్గాలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం గతంలో అధ్యక్షునిగా పనిచేసిన గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన సతీ తో పాటు తాజా మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పోటీ పడుతున్నారు. వీరిద్దరు కూడా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా “రైస్ మిల్లర్స్ అసోసియేషన్” ఎన్నికల్లో అతిగా కలగ జేసుకున్నట్లు తెలిసింది.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీలోని కీలక నే ఒకరు సతీష్ గెలుపు కోసం రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షునిగా సతీష్ గెలుపు కోసం శనివారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి జిల్లాలో ఓటు అర్హత కలిగి ఉన్న 51 మంది రైస్ మిల్లర్లలో 42 మంది హాజరైనట్లు ప్రచా జరుగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మరో కీలక నేత బాదo ప్రవీణ్ కు సపోర్ట్ చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది.
జిల్లా అధ్యక్షునిగా బాదం ప్రవీణ్ ను గెలిపించాలని సదరు వర్గం భావిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఓకే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ‘రైస్ మిల్లర్స్ అసోసియేషన్” లోని రెండు వర్గాలకు వేరువేరుగా మద్దతు లభిస్తుండటం అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయా? అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా చోటు చేసుకున్న ఈ పరిణామాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ములుగులో జరుగుతున్న “రైస్ మిల్లర్స్ అసోసియేషన్” జిల్లా ఎన్నికలు రైస్ ఇండస్ట్రీలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసాయి. గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
