Homeఆదిలాబాద్BLF | కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కులగణనలో బీసీ కాలాన్ని పెట్టాలి

BLF | కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కులగణనలో బీసీ కాలాన్ని పెట్టాలి

  • తెలంగాణ కాంగ్రెస్ (ప్రభుత్వం)ఇచ్చిన మూడు డిక్లరేషన్లను అమలు చెయ్యాలి
  • (బీఎల్ఎఫ్) నాయకుల డిమాండ్

1-11-2026నాడు మంచిర్యాల జిల్లా కేంద్రం లో జరిగే (బీఎల్ఎఫ్)రౌండ్ టేబుల్ సమావేశాని జయప్రదం చేయాలి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏంసీపీఐయు పార్టీ కార్యాలయం లో బహుజన లెఫ్ట్ ప్రంట్ (బీఎల్ఎఫ్)(BLF) సమావేశం పసులేటి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది.

- Advertisement -

ఈ సందర్బంగా నాయకులు, బీ ఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సంకె రవి, సబ్బని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బీ ఎల్ ఎఫ్ ఆధ్వర్యంలో 12/10/2026 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం పిలుపులో భాగంగా 2026 నవంబర్ 01 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కులగణనలో బీసీ కాలాన్ని పెట్టకుండా బీసీ ల జనాభా,ఆర్థిక,సామాజిక,రాజకీయ లెక్కలు తియ్యడం లేదు.

దీనివలన బీసీలు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది.బీసీ కాలాన్ని పెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిదంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుBC,SC,ST, డిక్లరేషన్లు చేసి అధికారంలోకి వస్తే మూడు డిక్లరేషన్లను అమలు చేస్తామణి హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి నేటికీ 3 సం.రాలు దాటిపోతున్న ఇచ్చిన డిక్లరేషనలను అమలు చెయ్యడం లేదని. వాటిని మూలకు పడేయ్యడం జరిగిందని బీసీ కాలాన్ని చేర్చాలని,మూడు డిక్లరేషన్లు అమలు చేయాలని కేంద్ర, ప్రభుత్వంపై ఒత్తిడి తిసుకురావడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగిందని సామాజిక సంస్థలు,నాయకులు, ఆలోచన పరులు హాజరు కాగలరని BLF పిలుపునిస్తుంది.

ఈ సమావేశంలో సంకె రవి (బీ ఎల్ ఎఫ్)రాష్ట్ర కన్వీనర్ నాయకులు సబ్బని రాజేంద్ర ప్రసాద్, పసులేటి వెంకటేష్ కన్నురి సమ్మయ్య తోగరి రాహులు జెంజర్ల శేఖర్ శంభోజీ రాజేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News