Homeనల్లగొండEl Niño | ఎల్‌నినో గ్రామసభలో పాల్గొన్న సీఈఓ

El Niño | ఎల్‌నినో గ్రామసభలో పాల్గొన్న సీఈఓ

  • నీరు, విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ఎర్రబెట్టుతండాలో నిర్వహించిన ఎల్‌నినో(El Niño) గ్రామసభలో నేడు సీఈఓ మేడం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నీరు, విద్యుత్ వినియోగం, వర్షాధార పంటల సాగు, తాగునీటి సమస్యలు, ఉపాధి హామీ జాబ్ కార్డుల కేవైసీ తదితర అంశాలపై చర్చించారు.

నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన

- Advertisement -

ప్రజలు విద్యుత్‌ను, నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగిస్తూ పొదుపు పాటించాలని సూచించారు. వర్షాధార పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయంలో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

తండా పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. అవసరాన్ని బట్టి, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జాబ్ కార్డుల కేవైసీ వెంటనే పూర్తి చేయాలి

ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డుల కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, క్రియాశీలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీఓకు ఆదేశించారు.

వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత

రైతులు తమ పొలాల్లో నీటి పునరుద్ధరణ నిర్మాణాలను పెంచుకోవాలని, వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ నీటి కుంటలు) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని తెలిపారు. ఈ గ్రామసభలో ఎంఎస్ఓ, ఎంపీడీఓ, తహసీల్దార్, వ్యవసాయ అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News